- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదాముల కొరత రాకుండా చూడాలి : ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్: రైతుల ధాన్యం నిల్వ కోసం గోదాముల కొరత రాకుండా చూడాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ సోఫీనగర్ గోదాముల్లో నిల్వ చేస్తున్న మక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అకాల వర్షం వల్ల రైతులు అధైర్య పడొద్దని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందన్నారు. లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వస్తుందన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 7451 మంది రైతుల నుంచి రూ.61 కోట్ల 38 లక్షల 82 వేల 720 విలువ గల 34 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశామన్నారు. ఇందులో 19,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు జిల్లాలోని 15 గోదాముల్లో నిల్వ చేయడం జరిగిందన్నారు. మిగతా 15 వేల మెట్రిక్ టన్నుల మక్కలను నిల్వ ఉంచడానికి గోదాములను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని గోదాములతో పాటు ఆర్మూర్, నిజామాబాద్, ధర్మాబాద్ గోదాముల్లో మక్కలు నిల్వ ఉంచుటకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ధాన్యం స్టోరేజీ కోసం ప్రభుత్వం రైస్ మిల్లర్లు, ఎఫ్‌సీఐతో వచ్చినట్టు తెలిపారు. జిల్లాలో 35 లక్షల గన్నీ సంచులు నిల్వ ఉన్నాయని తెలిపారు. వరిధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నల్ల వెంకట్రాంరెడ్డి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
Tags: Minister Indrakaran Reddy, inspects, grain storage, warehouses, adilabad