- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాసంగి పంటల ప్రణాళిక సిద్ధం చేయండి
దిశప్రతినిధి, ఆదిలాబాద్: యాసంగి పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి పంటల ప్రణాళిక పై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
యాసంగి పంట ప్రణాళిక సిద్ధం చేయాలనీ, నియంత్రిత పంటల సాగుపై రైతుల్లో విస్తృత అవగాహనా కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రధానంగా మొక్కజొన్న పంట నిల్వలు అధికంగా ఉన్నందున, దానికి బదులుగా మిగిలిన ప్రత్యామ్నాయ పంటలైన శనగ, ప్రొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు వంటి పంటలను పండించేలా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.