లిఫ్ట్‌లో చిక్కుకున్న తెలంగాణ మంత్రి, ప్రభుత్వ విప్

by Shyam |
లిఫ్ట్‌లో చిక్కుకున్న తెలంగాణ మంత్రి, ప్రభుత్వ విప్
X

దిశ, శేరిలింగంపల్లి: ఓ ప్రైవేట్ రియల్ ఏస్టేట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ విప్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో చోటుచేసుకుంది. సోమవారం ఓ ప్రైవేట్ రియల్ ఏస్టేట్ సంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ హాజరయ్యారు. కార్యాలయంలో పై అంతస్తులోకి వెళ్లేందుకు గ్రౌండ్ ఫ్లోర్‌‌లో ఉన్న లిఫ్టులోకి మంత్రి, ప్రభుత్వ విప్‌‌తో పాటు మరికొందరు నాయ‌కులు వెళ్లారు. గేటు వేసిన అనంతరం లిఫ్ట్ అధిక బరువు కారణంగా కదలక పోగా గేటు సైతం తెరచుకోలేదు. దాదాపు ఐదు నిమిషాల పాటు పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు శ్రమించి లిఫ్ట్ డోర్ తెరవడంతో మంత్రి, ప్రభుత్వ విప్ త‌దిత‌రులు బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Advertisement

Next Story

Most Viewed