- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదుకుంటాం.. అటవీశాఖ ఉద్యోగులకు మంత్రి భరోసా
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ మూలంగా మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. విధినిర్వహణలో కోవిడ్ సోకి ప్రాణాలు కొల్పోయిన అటవీ ఉద్యోగులకు నిర్మల్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో మంత్రి నివాళులర్పించారు. నిర్మల్ జిల్లాలో కరోనా సోకి మరణించిన ఐదుగురు అటవీ ఉద్యోగులు మరణించగా, తోటి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో అటవీ శాఖ ఉద్యోగులు రూ.2.50 లక్షల నిధులు సేకరించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 50 వేల ఆర్థికసాయం చేశారు. తోటి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడి, వారికి ఆర్థికచేయూనతనిందించిన అటవీ ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అటవీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని సకాలంలో అందేలా చూస్తామన్నారు.