- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను మీకు హామీ ఇస్తున్నా..: హరీశ్
దిశ, వెబ్‌డెస్క్: మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో మంత్రి గారికి కొంతమంది వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి వారి వద్దకు మంత్రి వెళ్లి పలకరించారు. ఆదుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో వారంతా ఆనందపడ్డారు.
విషయమేమిటంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వలస కూలీలు తమ పిల్లలతో కాలినడక తమ స్వరాష్ట్రాలకు బయల్దేరి వెళ్తున్నారు. వీరంతా కూడా మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో అటుగా వెళ్తున్న మంత్రి హరీశ్ రావుకు కనిపించారు. వారిని చూసిన వెంటనే తన కాన్వాయ్ ను ఆపి వారి వద్దకు చేరుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ కూలీలను అడిగారు. దీంతో వారంతా.. ‘మాకు పని, ఆహారం దొరకడంలేదు.. అందుకే మేం హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రాలకు నడుచుకుంటూ వెళ్తున్నాం’ అని చెప్పారు. వెంటనే చలించిపోయినా మంత్రి.. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నది… అదేవిధంగా మీరిలా ఇబ్బందులు పడుతూ కాలినడక వెళ్లడం శ్రేయష్కారం కాదని వారికి నచ్చజెప్పారు. అయినా కూడా వారు వీళ్లేదు.. తాము తమ ఊర్లలోకి వెళ్లాల్సిందేనని చెప్పారు. అప్పుడు మంత్రి మాట్లాడుతూ.. మనోహరాబాద్ లోనే ఆశ్రయం కల్పించి ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆనందపడ్డారు.
Tags: Migrant Workers, Manoharbad, Minister Harish Rao