బీజీగా ఉన్నా గంట కేటాయించండి: హరీశ్‌రావు

by Shyam |
బీజీగా ఉన్నా గంట కేటాయించండి: హరీశ్‌రావు
X

దిశ, సిద్దిపేట: కాలుష్యంతో ప్రపంచ ఆరోగ్య మనుగడ ప్రమాదంలో పడిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన యోగా వీడియోలను ఆదివారం తన నివాసంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘నేను ప్రతి రోజు యోగ చేస్తున్నా.. మీరు చేయండి. యోగ ఆరోగ్యానికి అమృతం లాటింది. ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి వికసిస్తుంది’. అని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట యోగా అసోసియేషన్ ప్రత్యేక వీడియో‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. నిత్య జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గంట సమయాన్ని యోగా కోసం కేటాయించాలన్నారు. యూట్యూబ్‌లో yoga for immunity by minister Harish Rao అని టైప్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యోగ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొమరవెల్లి అంజయ్య, అధ్యక్షుడు తోట అశోక్, చీఫ్ ప్యాట్రన్ చిప్ప ప్రభాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి తోట సతీష్, ఉపాధ్యక్షులు విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story