ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు

by Shyam |
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
X

దిశ, మెదక్: ముస్లింల మంత్రి హరీశ్ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని , పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహలతో జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం గుర్తించిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పండుగను సామూహికంగా జరుపులేకపోతున్నామని, ఎవరి ఇంట్లో వారే వేడుకగా జరుపుకోవాలని, కరోనా మహమ్మారి భారీ నుండి అందరం బయట పడాలని ఆ అల్లాని ప్రార్ధించాలని ఆయన కోరారు. సిద్ధిపేటలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించామని, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Advertisement

Next Story