హుజురాబాద్‌లో ట్రబుల్ షూటర్ ఎంటర్… ఇక రణమేనా?

by Sridhar Babu |   ( Updated:2021-08-11 02:06:46.0  )
హుజురాబాద్‌లో ట్రబుల్ షూటర్ ఎంటర్… ఇక రణమేనా?
X

దిశ, ప్రతినిది, కరీంనగర్: ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు హుజురాబాద్‌లో ఫిజికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇంతకాలం అండర్ గ్రౌండ్ వర్క్‌కే పరిమితం అయిన హరీష్ రావు.. ఇప్పుడు డైరక్ట్‌గా రంగంలోకి దిగారు. బుధవారం హుజురాబాద్ పట్టణానికి చేరుకున్న ఆయన బైక్ ర్యాలీతో వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాల్లో పర్యటించిన అనంతరం వీణవంకలో మహిళా సంఘాలతో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు.

మిత్రుని ఓటమి కోసమేనా…?

ఉద్యమ ప్రస్తానం నుండి ఈటల రాజీనామా వరకూ స్నేహితునిగా ఉన్న హరీష్ రావు.. ఆయన ఓటమి కోసం రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు బ్యాంక్ గ్రౌండ్ పాలిటిక్స్‌కే పరిమితం అయిన మంత్రి.. ఇప్పుడు డైరక్ట్ ఎంట్రీ ఇచ్చారు. హరీష్ రావుకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచరులు ఉండడం టీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందని అధినేత భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హుజురాబాద్ లో సమీకరణాలను అనుకూలంగా మల్చే బాధ్యతలను హరీష్ పై ఉంచారు ముఖ్యమంత్రి. అంచనాలకు తగ్గట్టుగానే హరీష్ సక్సెస్ కాగలిగారు. ఓ దశలో టీఆర్‌ఎస్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందా అన్న రీతి నుండి నేడు నువ్వా నేనా అన్న పరిస్థితికి తీసుకరావడంలో మంత్రి కృతార్థులయ్యారు.

విమర్శలకు చాన్సివ్వకుండా…

ప్రత్యర్థి ఈటల రాజేందర్ బీసీ కార్డుతో బరిలోకి దిగతుండడంతో అగ్ర వర్ణ నాయకులను హుజురాబాద్‌కు దూరంగా ఉంచిన సీఎం దళిత బంధుతో పాటు బీసీ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు హుజురాబాద్ లో పర్యటించినా.. ఈటల విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా చేయగలిగారు. ఇక నుండి హరీష్ రావు హుజురాబాద్ లో డైరక్ట్ గా ఎంటర్ అయి ఇక్కడ రాజకీయ సమీకరణాలను మార్చే పనిలో నిమగ్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story