- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల గెలిస్తే మీకేం లాభం.. వారికి మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న..
దిశ, సిద్ధిపేట : హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. దమ్ముంటే సీఎం కేసీఆర్, హరీశ్ రావు తనపై పోటీ చేసి గెలవాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకులు ఈటల సవాల్ విసరగానే.. ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారు. ఈటలను మళ్లీ గెలిపిస్తే మీకు వచ్చే లాభం ఎంటనీ హుజురాబాద్ ప్రజలకు సూటి ప్రశ్న వేశారు. ఆదివారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో తెరాస సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అసత్య ప్రచారాలతో హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు.
2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా, తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా సీఎం కేసీఆర్ నిలిపితే.. మోడీ సారధ్యంలో మన దేశ జీడీపీ బంగ్లాదేశ్ కన్నా తక్కువ స్థాయికి చేరుకుందని విమర్శించారు. హుజురాబాద్‌లో బీజేపీ ఎం చెప్పి ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. కేసీఆర్ ఐదు వేలు రైతు బంధు కింద రైతులకు ఇస్తే.. డీజిల్ ధరలు పెంచి అందులో సగం రూ.2500లు కేంద్రం తీసుకుంటోందన్నారు.
‘‘హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి అని, గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం చేకూరి అక్కడి అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..’’ అన్న చర్చ పెట్టాలని సోషల్ మీడియా వారియర్స్‌కు అవగాహనా కల్పించారు. దళిత బంధు హుజురాబాద్‌లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారని.. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదన్నారని, దీనిపై బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, హుజురాబాద్‌లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, సతీష్, దినేష్, జగన్మోహన్ రావు, వివిధ జిల్లాల నుండి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.