బీజేపీకి ఓటేస్తే బాయికాడ మీటర్లే: మంత్రి హరీష్ రావు

by Ramesh Goud |
బీజేపీకి ఓటేస్తే బాయికాడ మీటర్లే: మంత్రి హరీష్ రావు
X

దిశ, కమలాపూర్: రైతులు బీజేపీకి ఓటేస్తే వ్యవసాయ బావుల కాడ మోటార్లకు మీటర్లు పెట్టమన్నట్లే అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరులో బుధవారం జరిగిన ధూం ధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఏ పార్టీ గెలిస్తే మన హుజూరాబాద్ నియోజకవర్గం బాగుపడుతుందో, వాళ్లనే గెలిపించాలని అన్నారు. ఈటల రాజేందర్ ఓట్ల కోసం వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని, ఈటల గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని, బండి సంజయ్‌ని గెలిపిస్తే మండలానికి ఏం చేశాడో, ఈటల గెలిస్తే కూడా అదే పరిస్థితి అని విమర్శించారు. ఒక వ్యక్తికి లాభం కావాలా ?ఒక వ్యవస్థకు లాభం కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తే కారు ఎక్కించి చంపిన పార్టీ బీజేపీ అంటూ ఆరోపించారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, వితంతు పింఛన్, వృద్ధాప్య పింఛన్ పెంచి అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేస్తున్న మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

Advertisement

Next Story