- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో నిరుద్యోగిత రేటు అతి తక్కువ: హరీశ్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో నిరుద్యోగిత రేటు అతి తక్కువగా ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రైవేటు ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీపీఈఏ) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగింది. డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనతో పాటు ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కల్పనను పెంచినట్లు తెలిపారు. 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షత కారణంగా అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, విద్యుత్, నీళ్లు, శాంతిభద్రతలు ఇలా అన్ని రకాల వనరుల కల్పనతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువెత్తుతున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, నైపుణ్యాలతో తీర్చిదిద్ది ఉపాధి కల్పిస్తున్నామని, జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో నిరుద్యోగిత చాలా తక్కువన్నారు.