రానున్న రోజుల్లో రైతులు ఆ పంటపైనే ఫోకస్ పెట్టాలి : హరీశ్ రావు

by Shyam |
oil-palm -1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయిల్ పామ్ సాగును రాబోయే సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం ఆయిల్ పామ్ సాగుపై బీఆర్‌కే భవన్‌లో జరిగిన మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2022 నాటికి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును భారీ స్థాయిలో సాగయ్యేలా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పర్యావరణ అనుకూలమైన ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ నర్సరీలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఇతర వ్యవసాయ అధికారుల పాల్గొన్నారు.

Advertisement

Next Story