- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాయంపేట కాలువ పనులపై సమీక్ష
దిశ, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాన కాలువ ద్వారా సంగారెడ్డి, రామాయంపేటలకు సాగునీరు అందేలా కాలువల పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గజ్వేల్ కోమటి బండపై ఉన్న మిషన్ భగీరథ భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం రామాయంపేట కాలువ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ.36 కోట్ల భూసేకరణ నిధులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయిస్తాని తెలిపారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చిన్నశంకరంపేట, తూఫ్రాన్ మండలం కిష్టాపూర్, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పర్ పల్లి ప్రాంతాల్లోని కాలువల పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఏస్ఈ వేణు పాల్గొన్నారు.