‘పీవీ నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి’

by Shyam |
‘పీవీ నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి’
X

దిశ, మెదక్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరాడంబరతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పీవి శత జయంతి ఉత్సవాలను సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హరీశ్ రావు మట్లాడుతూ… ఈ ఏడాది పీపీ శత జయంత్ర ఉత్సవాలు ఏడాది పాటు నిర్వయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పీవీ విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి వారిని గౌరవించాలన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి పీవీ అని గుర్తుచేశారు. గొప్ప సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి పీవీ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఒక ఎకనమిస్ట్‌గా తీసుకువచ్చిన వ్యక్తి పీవీ అన్నారు. ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో రాజీవ్ రహదారి వచ్చింది అంటే అది పీవీ కృషినన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్, రఘోత్తం రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed