’మీ జీవితం భావితరాలకు ఆదర్శం‘

by Shyam |
’మీ జీవితం భావితరాలకు ఆదర్శం‘
X

దిశ, సిద్దిపేట: పద్మశ్రీ వనజీవి రామయ్యతో మంత్రి హరీశ్ రావు తన నివాసంలో అల్పాహారం చేస్తూ ముచ్చటించారు. ఎన్నాళ్లుగా మొక్కలు నాటడం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించగా.. తన ఐదో ఏటా నుంచే వనం మీద మక్కువతో మొక్కలు నాటుతున్నట్లు రామయ్య చెప్పారు. సమాజంలో మనిషికైనా మనుగడ చెట్లేనని, చిన్న అగ్గిపుల్లతో ఎంతో అగ్నిని సృష్టించవచ్చు, కానీ, ఆ అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుండే అని అన్నారు. మరి మీ బతుకు దేరువు ఏంటి అని మంత్రి అడుగగా.. గతంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిచానని, ఇప్పుడు కొడుకు చేస్తున్నాడు అంటూ రామయ్య సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు కోటి పైన మొక్కలు నాటానని.. ఇంకా మూడు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story