- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఊర చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఒక కోటి 76 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలను వదిలామన్నారు. వర్షాకాలంలోనే కాకుండా ఎండా కాలంలో కూడా నీరు వచ్చేలా ఓటీలు పెట్టి నీరు ఇవ్వడం ద్వారా చెరువులు, కాలువల్లో ఎల్లప్పుడూ నీరు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసి మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు ప్రభుత్వం
ఎంతగానో చేయూతనిస్తోందన్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,596 చెరువుల్లో 5 కోట్ల చేపపిల్లలను వదలనున్నట్టు మంత్రి వెల్లడించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐదారు చెరువుల్లో చేపపిల్లలను వదిలే వారని.. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అంతేగాకుండా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి హవేళిఘనపూర్ మండలం ముత్తాయిపల్లి నుంచి సర్ధనకు వెళ్ళే ఎనిమిదిన్నర కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.