రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : హరీష్ రావు

by Shyam |
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : హరీష్ రావు
X

దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మన గూడ గ్రామంలో మంగళవారం ఉదయం శనగ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆయనతో పాటు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతులు బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోళ్ల కేంద్రాలకు తేవాలన్నారు. తేమ శాతం ఉంటే కొనుగోళ్లు చేయరని, దీంతో స్థలాభావ సమస్య, ఇతర రైతులకు ఇబ్బందిగా ఉంటూరెండు రోజుల వరకూ రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఇబ్బందులు వస్తాయన్నారు. తోటి రైతులకు ఇబ్బందులు రాకుండా, ఏ రోజు ధాన్యం ఆ రోజే కొనుగోళ్లు జరగాలంటే, ధాన్యాన్ని ఆర బెట్టుకుని కొనుగోళ్ల కేంద్రలకు తేవాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. డివిజన్ ఆర్డీఓ, మండల తహసీల్దార్లు ప్రతిరోజూ కొనుగోళ్ల కేంద్రాల్లో పర్యటించి గన్నీ సంచుల కొరత, కొనుగోళ్ల కేంద్రంలో లారీలు రాకపోవడం ఇతరత్రా సమస్యలపై దృష్టి సారించాలని, సమన్వయ లోపం ఉంటే సమన్వయ పర్చాల్సిన బాధ్యత ఆయా మండలాల తహసీల్దార్లదేనని మంత్రి సూచించారు. కరోనా వ్యాధి నివారణ చేయాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తికి వ్యక్తికి మధ్య సామాజిక దూరం పాటించడమే అసలైన మార్గమని, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, చర్యలతో మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల వద్ద రైతులు ఓకేచోట గుమిగూడకుండా సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రతి కొనుగోళ్ల కేంద్రంలో నీళ్లు, సబ్బు, శానిటైజర్లను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. క్వింటాలు రూ.4875 మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. దళారులు లేకుండా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7770 వరి కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు.

Tags: Minister Harish Rao, inaugurated, Peanut, Purchase Center, medak, siddipet

Advertisement

Next Story

Most Viewed