కుంభవృష్టి పడ్డా ‘దళితబంధు’ సభ జరుగుతుంది : హరీష్ రావు

by Sridhar Babu |   ( Updated:2021-08-15 23:00:05.0  )
Minister Harish Rao
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘దళిత బంధు’ సభ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సులు చేరుకున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు వివరించారు. సోమవారం ఉదయం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మధ్యాహ్నం ఒంటి గంటకల్లా శాలపల్లి దళిత బంధు సభకు చేరుకోవాలని సూచనలు చేశారు. జర్మనీ టెక్నాలజీతో సీఎం కేసీఆర్ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయన్నారు. ప్రస్తుతం వర్షం పడే పరిస్థితులు లేవని, కుంభవృష్టి పడ్డా సభ జరిగి తీరుద్దని స్పష్టం చేశారు. వర్షం వచ్చినా సభ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వివరించారు. దళిత బంధు సభకు లక్ష మందికి పైగా జనం వస్తున్నారని తెలిపారు. 15 మంది లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. మొత్తం 20 వేల కుటుంబాల కోసం రూ.2 వేల కోట్లు కేటాయించనున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు కూడా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed