చింతమడక దేశానికే ఆదర్శం

by Shyam |   ( Updated:2020-06-20 06:39:55.0  )
చింతమడక దేశానికే ఆదర్శం
X

దిశ, మెదక్: సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక దేశానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు‌వేదిక నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ శివారులోని మల్లన్న సాగర్‌కు సంబంధించి దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించారు. త్వరలో చింతమడక, మధిర గ్రామాల చెరువులను కాళేశ్వరం జలాలతో నింపనున్నట్లు తెలిపారు. తోర్నాల, ఇర్కోడ్ గ్రామాల వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story