- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.20 లక్షల ఆర్థికసాయం చేయండి.. మంత్రి హరీష్ రావును కోరిన ఓసీలు
దిశ, హుజురాబాద్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హతకు కల్పించిన రూ.8 లక్షల ఆదాయ పరిమితి వెసులుబాటు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హతకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని నివారించాలన్నారు. మార్చి బడ్జెట్ సమావేశాల్లో రెడ్డి, ఆర్య వైశ్యుల సంక్షేమానికి కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలన్నారు.
విదేశీ విద్యను అభ్యసించేందుకు ఓసీ విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థికసాయం అందించాలని కోరారు. అంతేగాకుండా.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 50 ఏళ్ళు దాటినా వారికీ నెలకు రూ.5 వేల పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి హరీష్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రిని కలిసిన వారిలో శ్రావణ్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, కరుణాకర్ రావు, కిషన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాంరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.