- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
దిశ, మెదక్: సిద్ధిపేట నియోజకవర్గంలో మృతి చెందిన మృతుల కుటుంబాలను మంత్రి హరీశ్ రావు ఆదివారం కలిసి పరామర్శించారు. వంగ గాల్ రెడ్డి తనయుడు వంగ నిరంజన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు గాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబీకులను ఓదార్చారు. అనంతరం సిద్ధిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, సోదరుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన గూడూరి ఆగదాసు ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చారు. అదేవిధంగా భారత్ నగర్ లో సిద్ధిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కడవేర్గు ధర్మయ్య కుటుంబీకులను పరామర్శించారు. ధర్మయ్య సేవలను గుర్తు చేస్తూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెంటా మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఆయా వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.