- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటల కరెంట్ ఘనత టీఆర్ఎస్దే
దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతోందని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రామక్కపేట, చీకోడ్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని.. ఏడాదిలోగా సాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టినా బస్తా దొరికే పరిస్థితి ఉండేది కాదన్నారు. రైతులకు కాంగ్రెస్ దొంగ రాత్రి కరెంటు ఇస్తే, టీఆర్ఎస్ 24 గంటల పాటు అందిస్తోందని స్పష్టం చేశారు. డబ్బాలో రాళ్లు వేసి ఊపడం, సోషల్ మీడియాలో ఊగడం తప్పితే బీజేపీ చేసింది, చేసేది ఏమి లేదని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టె బీజేపీ దిక్కు ఉంటారా.. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న టీఆర్ఎస్ సైడ్ ఉంటారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు.