- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీశ్ రావు నోటి వెంట ఆ మాట.. షాక్‌లో లోకల్ లీడర్స్
దిశ, ఆందోల్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్‌లు చేస్తున్నారా..? ఓటు వేయమని కోరుతున్నారా..? అని అడిగింది ఎవరో కాదు సాక్షాత్తూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. మంగళవారం ఆందోల్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వేర్వేరుగా మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లతో సమావేశమయ్యారు. సమావేశంలో స్థానిక సమస్యలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జోగిపేట మున్సిపల్ సమావేశానికి తానే స్వయంగా హజరవుతానని, మీ సమస్యలన్నింటినీ తీరుస్తానని.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అనవసరంగా పోటీ చేస్తుందని, గెలిచేది లేదు.. ఏమీ లేదన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మెజార్టీ స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ యాదవ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ వారెవరైనా ఫోన్‌లు చేస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించడం, అవును సార్ చేస్తున్నారని కొందరు సభ్యులు సమాధానం ఇవ్వడం విశేషం. అయితే, ఇతర పార్టీ నాయకుల ఫోన్‌లు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి క్యాంపు కార్యాలయంలోని ప్రజాప్రతినిధులను కలిసి ఓటు వేయాలని అభ్యర్తించారు.