- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ వార్నింగ్..
దిశ, సూర్యాపేట: అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హెచ్చరించారు. పెన్‌పహాడ్ మండలం దూపహాడ్ గ్రామ పరిధి లో వేసిన నెల రోజులకే శిథిలావస్థకు చేరిన ఆర్‌అండ్‌బీ రహదారిని స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే దూరజ్‌పల్లి- గరిడేపల్లి ఆర్అండ్‌బి రహదారి వేసిన నెల రోజులకే శిథిలావస్థకు చేరడం పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పని చేస్తుంటే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఏమి చేశారంటూ నిలదీశారు. దీంతో నీళ్లు నమిలిన అధికారులు పొరపాటుని ఒప్పుకుని మళ్లీ ఇలాంటివి జరుగకుండా చూసుకుంటామని చెప్పడంతో మంత్రి శాంతించారు. 15 రోజుల్లో దూపహాడ్ గ్రామంలో గుంతల మయంగా ఉన్న రాజీవ్ విగ్రహం నుండి మిషన్ భగీరథ ట్యాంక్ వరకు అన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సీసీ రహదారి నిర్మించాలని ఆదేశించారు.
దీంతో తమ రహదారి పాడైపోయిన విషయం తెలిసిన వెంటనే నేరుగా అధికారులతో వచ్చి సమస్యను పరిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డికి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. మంత్రితో పాటు గ్రామ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ సింగారెడ్డి, గట్టు డైరెక్టర్ ఆవుల అంజయ్య యాదవ్, కొప్పోలు రంగమ్మ, బిట్టు వెంకన్న, సరోజనమ్మ, సైదయ్య తదితరులు ఉన్నారు.