- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంకితభావం, పోరాటపటిమతో భవిష్యత్ జగజ్జేతలుగా నిలవాలి.. మంత్రి గౌతమ్ రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: ‘గట్టిగా ప్రయత్నిస్తే ఆకాశమేమీ హద్దు కాదు. సముద్రం పెద్ద లోతు కాదు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. కన్నీళ్లు సుడిగుండంగా మారినా.. మంచైనా.. చెడైనా వెనుతిరిగి చూడొద్దు. ఎక్కడా ఆగిపోవద్దు. మీ ఆలోచన, మీ ఆచరణే మీ హద్దు అంటూ’ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి యువతలో స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం వేదికగా బుధవారం జరిగిన దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల ప్రారంభోత్సవానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రతి ఆలోచన, ఆచరణ యువత కోసమేనని తెలిపారు. జగన్ ఆలోచనలు సైతం యువత ఆలోచనలకు దగ్గరగా ఉంటాయని వెల్లడించారు.
యువత మార్చ్ ఫాస్ట్‌తో స్ఫూర్తి పొందిన ఆయన యువతలో స్ఫూర్తి నింపేలా వ్యాఖ్యలు చేస్తూ సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలకు వచ్చిన యువతీ యువకులందరికీ అభినందనలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్, డెల్, జేబీఎమ్, సీఐఐ వంటి ప్రఖ్యాత సంస్థల ద్వారా పరిశ్రమలకు సన్నద్ధంగా ఉండేలా శిక్షణ అనేది అంకితభావంతో తీసుకుంటే విజయం మీ సొంతం అవుతుందన్నారు. నైపుణ్యం, అంకితభావం, పోరాట పటిమతో భవిష్యత్ జగజ్జేతలుగా నిలవాలి అని వ్యాఖ్యానించారు.
నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 500 మంది యువతీయువకులు భారతదేశం గర్వించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున్, ఏయూ వైస్ చాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.