- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమతను అభినందించిన మంత్రి గౌతంరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని రైతులకు అందించడంలో ప్రథమ స్థానంలో నిలిచిన వ్యవసాయ సహాయకురాలు మమతను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అభినందించారు. 13జిల్లాల్లో అద్భుతంగా అమలు చేసిన వ్యవసాయ సహాయకుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్న మమత ఉత్తమ పనితీరును మంత్రి ప్రశంసించారు. బట్టేపాడు పరిధిలో అర్హులైన 300మంది రైతన్నలకు నూటికి నూరు శాతం రైతు భరోసాను అందించడం, ధాన్యం కొనుగోలు వందశాతం పూర్తి చేయడం, ప్రతిరోజూ ప్రతి రైతు పంటను పరిశీలించి చీడ, పీడలను పర్యవేక్షించి తగు సలహాలివ్వడం, అవగాహన కల్పించడం, వైఎస్ఆర్ యాప్ ద్వారా దిగుబడి, వ్యవసాయ ఉత్పత్తి, సంస్కరణలను నిత్యం కంప్యూటరీకరణ చేయడంలో మమత చేసిన కృషిని మిగతా ఆర్బీకేలు స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు.