- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశాం
దిశ ప్రతినిధి, కరీంనగర్: గతకొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని ముంపు బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాలోని 1300 చెరువులన్నీ నిండిపోయాయన్నారు. అంతేగాకుండా 18 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చామని తెలిపారు.
వరద నీరు తగ్గుముఖం పట్టిన తరువాత సర్వే జరిపించి నష్టాన్ని అంచనా వేసి, ఆదుకుంటామని కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో వరద నీరు మూలంగా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు.
కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ సామర్ధ్యం 24 టీఎంసీలకు కాగా, 17 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఎల్ఎండీ పరివాహక ప్రాంతమైన మోయతుమ్మెద వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని మంత్రి వెల్లడించారు. మిడ్ మానేరులో 25 టీఎంసీలకు గానూ 20 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఈ ప్రాజెక్టు నిండితే ఎల్ఎండీకి వదిలే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఎల్ఎండీ, మిడ్ మానేరు ప్రాజెక్టుల దిగువ ప్రాంతాలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారని చెప్పారు.