ఆ అడవి గుట్టకు కేసీఆర్ పేరు

by Sridhar Babu |   ( Updated:2020-07-09 11:49:43.0  )
ఆ అడవి గుట్టకు కేసీఆర్ పేరు
X

దిశ, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీళ్లతో పాటు పచ్చని చెట్లంటే ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మట్లాడుతూ… గంగాధర మండలం వెదురుగట్టలో పెంచుతున్న అడవులకు కేసీఆర్ వనంగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన ప్రతిపాదనను ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమానికి తన నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కాంక్రీట్ జంగల్‌గా ఉన్న నా కరీంనగర్‌ను హరిత వనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కసితో పని చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నగర పాలక సంస్థ‌కు రూ.50 లక్షలు చొప్పదండి మున్సిపాలిటీ రూ. 30లక్షలు కొత్తపల్లి మున్సిపాలిటీకి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్టు వివరించారు.

Advertisement

Next Story