చివరి ఆయకట్టుకూ నీరందించే బాధ్యత నాదే : ఈటల

by Sridhar Babu |
చివరి ఆయకట్టుకూ నీరందించే బాధ్యత నాదే : ఈటల
X

దిశ, కరీంనగర్: చివరి ఆయకట్టు వరకూ నీరందించే బాధ్యత తనదేనని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో శుక్రవారం వానాకాలం 2020 ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి మట్లాడుతూ.. మార్చి 31 లోగా రెండు పంటలు పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందిచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత సీఎం కేసీఆర్‌ను హుజురాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. హుజురాబాద్‌లో గతేడాది 50 వేల ఎకరాల్లో వరి పంట వేస్తే ఈ యాసంగిలో 71 వేల ఎకరాల్లో నాట్లు వేశారన్నారు. ఎస్సారెస్పీ డీబీమ్16 నుంచి 21వరకూ నీళ్లు రాని పరిస్థితి ఉండేదని నూతన రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నియోజకవర్గంలో పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. 2009లో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 21 చెక్ డ్యాంలు నిర్మించామని, ముఖ్యమంత్రి సూచించినట్టు 60 వేల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో మక్కలను పండిస్తున్నారని ఈటల రాజేందర్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed