మొదటిది ధైర్యం.. రెండోది ఆక్సిజన్: ఈటల

by Shyam |
మొదటిది ధైర్యం.. రెండోది ఆక్సిజన్: ఈటల
X

దిశ, వెబ్‌‌డెస్క్: కరోనా విపత్తు వస్తుందని ఎవరూ ఊహించలేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుత టెక్నాలజీ సమయంలో కూడా కరోనాకు భయపడాల్సిన పరిస్థితి రావడం భాదాకరమన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడని మరోసారి నిరూపితమైందన్నారు. కరోనా తరువాత మానవ సంబంధాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మనిషిని చంపే శక్తి కరోనాకు లేదని.. కానీ, నిర్లక్ష్యంగా ఉండే మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. కరోనాకు మొదటి మందు ధైర్యం అయితే.. రెండోది ఆక్సిజన్ అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story