- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య రంగంలో విస్తృత మార్పులు
దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో విస్తృత మార్పులు చేస్తున్నదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై శాసనమండలిలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి లెవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీపీ, షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీసమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతుందని చెప్పారు. వ్యాధి ముదిరిన వారు డయాలసిస్ చేసుకోవడం లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవకోవడమే ఉత్తమమని సూచించారు. ప్రస్తుతానికి జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 9, టీచింగ్ హాస్పిటల్స్‌లో 45డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో సెంటర్లో 5 నుంచి 10వరకు బెడ్స్ ఉన్నట్టు వివరించారు.రోగులు రాగానే డయాలసిస్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరికొన్ని సెంటర్లను నిమ్స్ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నట్టు స్పష్టంచేశారు. అంతేకాకుండా పేదలకు ఉచితంగా డయాలసిస్ చేస్తున్నామన్నారు. ఒక్కో డయాలసిస్ పేషంట్‌పై ఏడాదికి రూ.1,80వేలు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
TAgs: minister etela rajender, assembly meet, mlc sheri subhash reddy questions