- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు: మంత్రి ఎర్రబెల్లి
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలన్నారు. ప్రతీ మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు.