టీకా వేయించుకున్న మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
టీకా వేయించుకున్న మంత్రి ఎర్రబెల్లి
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు : రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు వ్యాక్సిన్ వేయించుకున్నారు. మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయ‌న కొవిషీల్డ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఆయ‌న భార్య ఉషా దయాకర్ రావు, వారి కుటుంబ సభ్యులూ టీకా వేయించుకున్నారు. వీరితో పాటే మేయర్ గుండా ప్రకాశ్‌ రావు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

అనంతరం మేయర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డీఎంహెచ్‌వో, ఎంజీఎం సూపరింటెండెంట్ తదితరులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 136 కేంద్రాలు, వరంగల్ అర్బన్ జిల్లాలో 49 కేంద్రాల్లో వాక్సిన్ వేస్తున్నట్లు ఆయ‌న చెప్పారు. ఇక్కడ రెండో వైర‌స్ ప్రభావం పెద్దగా లేకున్నా ప్రజలు అప్రమ‌త్తంగా ఉండాల‌న్నారు. 60 ఏండ్లు పైబడిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హులంతా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed