అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి అమోఘం : మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి అమోఘం : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: ఆధునిక యుగంలో మహిళలు ఇళ్లు చక్కదిక్కడమే కాకుండా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుతున్నారని, వారు కనబరిచే శక్తి అమోఘమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు, మాస్కుల తయారీ, ప్రస్తుతం మామిడి కాయల కొనుగోళ్లలోనూ వారు ముందున్నారని వివరించారు.మంగళవారం జనగామ జిల్లా పెద్ద పహాడ్‌లో ఐకేపీ మామిడి కాయల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 3 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో SERPఆధ్వర్యంలో ఐకేపీ మామిడి కాయలు కొనుగోలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాల ద్వారా మామిడి కాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం ఖమ్మం, నాగర్ కర్నూలు, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లో సెంటర్లు పని చేస్తున్నాయన్నారు. నేడు జనగామలో 6వ కొనుగోలు కేంద్రం‌ అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే మిగతావి ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 300 మెట్రిక్ టన్నుల మామిడి కాయలు కొనుగోలు చేశామన్నారు. మామిడితో పాటే పుచ్చ, అరటి, బొప్పాయి వంటి పండ్లను కూడా కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed