- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మా రాష్ట్రమే.. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’
దిశ, వరంగల్ :
రాష్ట్రంలో ఈ ఏడు యాసంగి పంటలు బాగా పండాయని, రైల్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను వెనక్కి నెట్టి తెలంగాణ ముందు వరుసలో చేరిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా మంత్రి సాగు నీటిని విడుదల చేశారు. అంతకు ముందు గంగమ్మకు పసుపు కుంకుమ, పూలతో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలువల ద్వారా సాగుకు నోచని తెలంగాణ ప్రజల కల నేటితో నెరవేరిందన్నారు.దీని ద్వారా చెన్నారం, బొల్లికుంట చెరువులు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, దిగుబడి కూడా అత్యధికంగా వచ్చిందన్నారు. మరో 20 లక్షల ఎకరాల్లో మక్కలు, ఇతర పంటలు పండాయన్నారు.మరో 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తే తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అవుతుందని ఆకాంక్షించారు. అన్నపూర్ణ ఆంధ్ర అనే నానుడిని తెలంగాణ తిరగ రాసిందన్నారు.ఇకమీదట సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఏపీ కాదని.. తెలంగాణ అని స్ఫష్టంచేశారు. కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.