పెన్షన్ల విషయంలో బీజేపీవి వట్టి ప్రగల్భాలే: మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
పెన్షన్ల విషయంలో బీజేపీవి వట్టి ప్రగల్భాలే: మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: పేదలకు తామే సామాజిక పెన్లన్లు ఇస్తున్నట్టు బీజేపీ ప్రగల్భాలు పలుకుతోందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఆరోపించారు. ఈ విషయంలో విత్తేసి పొత్తు కూడిన‌ట్లుగా బీజేపీ వ్య‌వ‌హారం ఉంద‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేసే సాయంలో ఏదో కొద్దిగా ఇచ్చేసి కేంద్రం చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. శుక్రవారం మే డే సంద‌ర్భంగా వరంగ‌ల్ రూర‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లం కోనాయి మాకుల‌లో ఆయన జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం వ‌ల‌స కూలీలు, కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవ‌ర్లు, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులను పంపిణీ చేశారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్ష‌న్లు ఆగొద్ద‌ని సీఎం కేసీఆర్ సూచించినట్టు చెప్పారు. పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తుంటే, అందులో కేవ‌లం రూ. 200 కోట్లు మాత్ర‌మే కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. అదంతా తామే చేస్తున్న‌ట్టు బీజేపీ చెప్పుకోవడం సరికాదన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు వాస్తవాలు చెప్పాల‌ని, త‌ప్పుదోవ ప‌ట్టించొద్ద‌ని బీజేపీకి హిత‌వు పలికారు.

Tags: Warangal,Minister,Errabelli Dayakar rao,May day, Workers, Essential goods

Advertisement

Next Story