గీసుకొండ సామూహిక ఆత్మహత్యలపై మంత్రి విచారం

by Shyam |
గీసుకొండ సామూహిక ఆత్మహత్యలపై మంత్రి విచారం
X

దిశ, వరంగల్
వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలో పడి బీహార్‌కు చెందిన వలస కూలీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేసారు. బతుకు దెరువు కోసం వచ్చి తనువు చాలించడం, అందులో ఓ చిన్నారి ఉండటం తనను కలచి వేసిందన్నారు.ఈ విషయాన్నివెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు.ఈ ఘటనను కరోనా మిగిల్చిన విషాదంగా పేర్కొన్న మంత్రి వలస కూలీలకు ప్రభుత్వం మనిషికి 12 కిలోల బియ్యం, రూ.500, వసతి కల్పించి ఆదుకుంటోందన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వలస కూలీలకు ఆహారం, వసతి వంటి సమస్యలు ఎదురైతే, వెంటనే సమీపంలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులను సంప్రదించాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story