వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ

by Shyam |
వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, హైదరాబాద్ :

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలను ప్రజలు కచ్చితంగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు బన్సీలాల్ పేట మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేషన్ కార్డులు లేకున్నా.. వలస కూలీలకు 12 కేజీల బియ్యం, 1 కిలో పప్పు, రూ.500 అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 85 కేంద్రాల ద్వారా ఈ పంపిణీ చేపట్టినట్టు వెల్లడించారు.

కరోనా వైరస్‌ను స్వీయ నియంత్రణ ద్వారానే అరికట్టవచ్చని, ఈ సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులను 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా వలస కూలీలకు బియ్యం, మంచినూనె, శెనగపప్పు, గోదుమ పిండి, ఉప్పు, కారంపొడి, ఆవాలు, జీలకర్ర, పసుపు తదితర ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, ఏసీపీ శ్రీధర్, స్థానిక కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.

Tags: Corona Effect, Rice Distribution, Minister Talasani, Secunderabad, Hyderabad Collectorate

Advertisement

Next Story