- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా నివారణ చర్యలపై మంత్రి ఎర్రబెల్లి ఆరా..
by vinod kumar |

X
దిశ, వరంగల్: జిల్లాలో కరోనా నివారణకు తీసుకుంటున్నచర్యలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరా తీశారు. శనివారం తొర్రూరులో పర్యటించి పట్టణంలోని ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రోడ్డుపై గల బ్యాంక్ వద్ద వినియోగదారులు అధికసంఖ్యలో ఎందుకు ఉన్నారోనని ప్రశ్నించారు. అనంతరం బ్యాంక్ ఉద్యోగులను పిలిపించి మాట్లాడారు. కస్టమర్స్ అలా నిలబడితే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. లాక్‌డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని, ఇతరులకు దూరంగా నిలబడాలని కస్టమర్లకు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన వెసులు బాటును ఎవరూ దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కల్పించుకుని పరిస్థితి చక్కదిద్దారు.
Tags: corona, lockdown, thorrur, minister dayakar
Next Story