- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దాంతో ప్రజలు జెర జాగ్రత్తగా ఉండాలే’
దిశ, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, దేవాదుల, పాలమూరు రంగారెడ్డి వంటి పలు సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం కానుందని, రైతును రాజు చేసే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, రైతు అనుబంధ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. రైతు వేదికలతో దళారుల నుంచి రైతులకు విముక్తి లభిస్తుందని, గిట్టుబాటు ధరలు కల్పించడానికి వీలవుతుందన్నారు. ఉమ్మడి వరంగల్‌లోని జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించిన మంత్రులు జనగామ జిల్లా రామవరం, కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు, అమ్మాపురం గ్రామాల్లో రైతు వేదికలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే నాంచారి మడూరు గ్రామంలో మొక్కలు నాటి ప్రకృతి వనానికి అంకురార్పణ చేశారు. ఆయా రైతువేదికల శంకుస్థాపనల అనంతరం మంత్రులిద్దరూ మాట్లాడుతూ.. రైతులను రాజులు చేయడానికే సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ రైతులను ఇబ్బందులు పెట్టకూడదన్న లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రైతాంగం ధాన్యం కొనుగోలు ఒక్క తెలంగాణలో తప్ప, దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. రూ.30వేల కోట్లతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఘతన కేసీఆర్ దేనని చెప్పారు. కరోనాతో ప్రజలు జెర జాగ్రత్తగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పకడ్బంధీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జనగామ, మహబూబాబాద్ కలెక్టర్లు నిఖిల, గౌతం, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.