- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రితో బుగ్గన భేటీ
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వివరణ ఇచ్చారు. అలాగే రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ రాక్ అల్యూమినియం కంపెనీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అన్ రాక్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించినట్లు బుగ్గన వెల్లడించారు. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్‌ను సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అన్‌రాక్ కంపెనీ కేసు పరిష్కారమైతే రాష్ట్రానికి ఒక పెద్ద కంపెనీ వస్తున్నట్లవుతుందన్నారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటుపై కూడా కేంద్రమంత్రితో చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఈ సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు రాష్ట్రంలో వీలైనన్ని ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశమన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా చర్చించామని.. నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారన్నారు.
టీడీపీ రాద్ధాంతం రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకు ప్రభుత్వం అప్పులు చేసిందని వివరణ ఇచ్చారు. టీడీపీ హయాంలో కరోనా లేనప్పటికీ అప్పులు చేశారని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయినందువల్లే అప్పులు చేయక తప్పలేదన్నారు. రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తోందని..ఈ ప్రవర్తన రాష్ట్రానికే ప్రమాదకరంగా మారిందని బుగ్గన విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్ర భవిష్యత్‌పై టీడీపీ కోలుకోలేని దెబ్బ తీస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుర్మార్గపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు.