ముమ్మాటికీ మూడు రాజధానులు ఉంటాయి: మంత్రి బొత్స..

by srinivas |   ( Updated:2021-11-16 06:07:48.0  )
bostsa satyanarayana
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మాటికీ మూడు రాజధానులు ఉంటాయని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులను అడ్డుకునేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవన్నారు. త్వరలోనే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభంకానుందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు నిర్మించలేరన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలడా అని ప్రశ్నించారు. మరోవైపు అమరావతి రైతుల మహాపాదయాత్రపైనా సెటైర్లు వేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో యాత్ర జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

కుప్పంలో వైసీపీదే గెలుపు

కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపు వైసీపీదేన‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ధీమా వ్యక్తం చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఉందన్నారు. ఎలాగూ ఓడిపోతామని తెలుసు కాబట్టే వైసీపీ దొంగ ఓట్లు వేయించిందని, అల్లర్లకు పాల్పడ్డారంటూ.. పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నాడని బొత్స మండిపడ్డారు. దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసునని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story