- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌలు చెల్లించినా రెచ్చగొడుతున్నారు: బొత్స
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రైతుల కౌలు డబ్బులు వారి ఖాతాలో జమ చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. సాంకేతిక కారణాలతో కౌలు జమ చేయడం ఆలస్యమైందన్నారు. కౌలు రైతులకు పింఛన్ రూ.5000 కు పెంచాలనుకున్నామని.. అయితే ఈ వ్యవహారంపై కోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో సాధ్యపడలేదన్నారు.
గురువారం విజయనగరంలోని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆక్సిజన్ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రైతులకు కౌలు చెల్లించినా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని బొత్స విమర్శించారు. కాగా, కౌలు చెల్లింపులో జాప్యం ఏర్పడటంతో విజయవాడలోని ఏఎంఆర్‌డీఏ కార్యాలయాన్ని రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story