- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లోకేష్ ఉన్నంత కాలం టీడీపీ ఎదగదు’
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ భూములు కబ్జాలకు గురైనట్టు మంత్రి అంతి శ్రీనివాస్ అన్నారు. గాజువాక మండలంలో అన్యాక్రాంతమైన యూ.ఎల్.సి.భూములు గుర్తించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యూ.ఎల్.సి భూములను ఆక్రమించారని పేర్కొన్నారు.
పల్లా కుటుంబం ఆక్రమించిన భూముల విలువ 200 కోట్లకు పైనే ఉంటదని, కబ్జా చేసిన భూముల్ని ప్రబుత్వం స్వాధీనం చేసుకుంటుందని టీడీపీ పై మండి పడింది. ఇది సామాన్యల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం ఆక్రమణలకు పాల్పడితే ఏ పార్టీ నేతలైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నేతల భూ ఆక్రమణలపై చంద్రబాబు స్పందించాలి ఆయన డిమాండ్ చేశారు. ఆక్రమణలకు గురైన 48 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నామని పేర్కొన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై సిట్ నివేదిక బయటపెడతాం. పల్లా సింహాచలం అండ్‌కో రూ.700 కోట్ల విలువైన భూకబ్జా చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాతోపాటు కొంత భూమిని అమ్మేశారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాము త్వరలోనే సిట్ నివేదిక ఇవ్వనుందని మంత్రి అంతి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదు లోకేష్ మాత్రమేనని లోకేష్ ఉన్నంత కాలం టీడీపీ ఎదగదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.