ముంపు వాసులను తక్షణమే తరలించాలి

by srinivas |
ముంపు వాసులను తక్షణమే తరలించాలి
X

దిశ, ఏపీ బ్యూరో: కండలేరు జలాశయం పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డితో కలిసి కండలేరు జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలాశయాల పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కండలేరులో ప్రస్తుత నీటి మట్టం 53 టీఎంసీలుగా ఉంది.

Advertisement

Next Story