గులాబీ మాస్కు ధరించిన మంత్రి అల్లోల

by Aamani |
గులాబీ మాస్కు ధరించిన మంత్రి అల్లోల
X

దిశ, ఆదిలాబాద్:
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ గులాబీ మాస్కులు ధరించాలని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రోమోగా ఎంపీ సంతోష్ టీఆర్ఎస్ పార్టీ రంగు కేసీఆర్ బొమ్మతో కూడిన గులాబీ మాస్కు ధరించి మీడియాకు విడుదల చేశారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదే మార్కు మాస్క్‌ను ధరించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యకర్తలందరూ గులాబీ రంగు మాస్కులు ధరించాలని పిలుపునిచ్చేలా మంత్రి అల్లోల ఒకరోజు ముందే గులాబీ రంగు మాస్కుతో ప్రచారం చేశారన్న చర్చ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది.

Tags: Minister indra karan reddy, wearing, pink mask, trs party, mp santhosh

Advertisement

Next Story