ప్రజలను వెంటనే అప్రమత్తం చేయండి

by srinivas |
ప్రజలను వెంటనే అప్రమత్తం చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వరుసగా పిల్లలు అస్వస్తతకు కావడం కలకలకం రేపుతోంది. కొద్దిరోజలుగా పిల్లలు మూర్ఛలక్షణాలతో కిందపడిపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 25 మంది పిల్లలు ఇలా అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధిపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే చేస్తున్నారు. తాజాగా దీనిపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. బాధితులందరికీ అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని అన్నారు. అస్వస్థతకు ఎందుకు గురయ్యరన్నది కారణం తెలియరాలేదని తెలిపారు. కలుషిత నీరు, మరేదైనా కారణం ఉందన్న దానిపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed