- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: భూపాల్
X
దిశ, అమరచింత: వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతన చట్టం, ఉద్యోగ భద్రతను అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో ప్రభుత్వ విధానాలు కార్మికులపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇన్స్యూరెన్స్, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్, సీఐటీయూ మండల కార్యదర్శి రమేష్, నాయకులు బుచ్చన్న, ప్రభాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story