ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. అసద్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. అసద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మించబోతున్న మసీదుకు ఎవరూ చందాలు ఇవ్వొద్దని, చందాలు ఇవ్వడం తప్పు అని అన్నారు. గురువారం ఆయన ఎంఐఎమ్ సమావేశంలో మాట్లాడుతూ… చందాల ద్వారా నిర్మించిన మసీదులో నమాజ్ కూడా చేయకూడదని మతపెద్దలు చెబుతున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా బాబ్రీమసీదు కూల్చిన చోట మసీదు నిర్మాణం అనైతికం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏకమైతే 70 ఏళ్ల నుంచి రాజకీయ లబ్దిపొందుతున్న వాళ్లను కూల్చగలం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దళితులకు తాము సహకరిస్తామని, ముస్లీంలు ఎవరూ ఎన్నికల్లో దళితులతో పోటీపడొద్దు అని పిలునిచ్చారు. తాను అంబేద్కర్‌కు అభిమానిని అని మరోసారి బహిరంగంగా వెల్లడించారు. దేశంలో శాంతికోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story