Mike Hussey : ఆస్ట్రేలియా చేరుకున్న మైక్ హస్సీ

by Shyam |   ( Updated:2021-05-16 20:42:26.0  )
Mike Hussey : ఆస్ట్రేలియా చేరుకున్న మైక్ హస్సీ
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హస్సీ ఆదివారం ఇండియా నుంచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2021లో పాల్గొనడానికి వచ్చిన హస్సీ.. కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. హస్సీతో పాటు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా సోకడంతో వారిద్దరికీ చెన్నై జట్టు యాజమాన్యం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించింది. చికిత్స అనంతరం తొలి సారి నెగెటివ్ వచ్చినా.. మరోసారి పరీక్ష చేయగా అతడు పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడికి ఐసోలేషన్‌లో చికిత్స అందించారు. హస్సీ పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం దోహా మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయమే విమానంలో అతడు స్వదేశం వెళ్లిపోయాడని, ప్రస్తుతం హస్సీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ తెలిపారు.

Advertisement

Next Story